మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో మంత్రి సత్యవతి రాఠోడ్ తన నివాసంలో ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. తన తల్లిదండ్రులైన గుగులోతు లింగ్యానాయక్-దస్మీ దంపతులతో కేకు కట్ చేయించారు.
తల్లిదండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందుతో పాటు మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.