మహబూబాబాద్‌లో త్వరలో వైద్య కళాశాల, నూతన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లాలో పండే మిరపతో కేన్సర్ నిరోధక ఔషధాలను తయారు చేసే ఫార్మా కంపెనీని త్వరలో జిల్లాలో ఏర్పాటు చేయనున్నామని దాని కోసం 28 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 36 వార్డులు గెలుచుకోవాలని కార్యకర్తలకు నిర్దేశించారు.
- ఇదీ చూడండి : హాంగ్‌కాంగ్: విదేశీయులకు కష్టాలు చెప్పుకున్న ప్రజలు