తల్లిదండ్రులు అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బడితండాలో చోటుచేసుకుంది. వారిలో పెద్ద కుమారుడైన చరణ్(12) కూలీ చేసి తెచ్చిన పైసలతో ముగ్గురు జీవనం గడుపుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారగా... పలువురు ఆర్థిక సహాయాన్ని అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
వెల్లివిరిసిన మానవత్వం:
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్మీ జవాన్ల అసోసియేషన్ సభ్యులు చిన్నారులకు 50 వేల నగదు, 20 వేల విలువగల ఇంటి సామాగ్రి, సంవత్సరానికి సరిపోయే నిత్యావసరాలను అందించారు. ఇల్లు సరిగాలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పిల్లలకు వరంగల్ జిల్లా విద్యా ఫౌండేషన్ వారు 1లక్ష రూపాయల వ్యయంతో ఇల్లును పునరుద్ధరిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారు రూ.80,500 నగదును, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రూ.5 వేలు, నర్సంపేట ఫ్లవర్స్ డెకరేషన్ యూనిట్ రూ.5300, రంగసాయి పేట డిఫెన్స్ వారియర్స్ రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి: రేపు భద్రాచలంలో ముగ్గురు మంత్రుల పర్యటన