
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ రైతు కుటుంబంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబాన్ని అధికారులు నాలుగు రోజుల కిందట హోం క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ రైతు పంట కల్లంలో ఉన్న మొక్కజొన్న పంటను చూసేవారు లేక, బయటకు వచ్చే పరిస్థితి లేక అన్నదాత కుటుంబం ఆందోళన చెందుతుండగా.. విషయం తెలుసుకున్న జడ్పీ ఛైర్‌పర్సన్ ఆంగోతు బిందు స్వయంగా రైతు పంట కళ్లంలోకి వచ్చి పంటను పరిశీలించారు. మొక్కజొన్నను దగ్గరుండి ఒక్కచోటకు నూర్పించి కాంటా వేయించి బస్తాలను గోదాముకు తరలించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.