మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. పట్టణ ప్రగతిలో భాగంగా 8,10,11, 13 వార్డుల్లో ఆయన పర్యటించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. రహదారులు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు.
ఇవీ చూడండి: ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'