ఉదండాపూర్ జలాశయంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వల్లూరు నుంచి మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ పీసీసీ కార్యదర్శి అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో వల్లూరు, ఉదండాపూర్, తీగలపల్లి, కాకర్లపాడు మీదుగా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లారు.
పాదయాత్ర సమాచారం అందుకున్న పోలీసులు తొలుత కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వల్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభం చేశారు. ఉదండాపూర్ జలాశయ బాధితులకు ఎకరాకు 12 లక్షలు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇండ్ల స్థలాలు పరిహారం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ అమలు చేయాలని అన్ని రకాల పరిహారాలు ఏకకాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఉదండపూర్ జలాశయం నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస