ETV Bharat / state

పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస - శాసనసభ సమావేశాలు

రాష్ట్ర కాంగ్రెస్‌.. అధికార పార్టీపై పోరాటం చేసే దిశలో ముందుకు వెళుతుండగా... తెరాస మాత్రం ఎక్కడికక్కడ హస్తం పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. నిలువరించేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ వైఖరిని ఎండగడుతూ.. చేస్తున్న వ్యాఖ్యలపై తెరాస సభ్యులు ఒంటికాలిపై లేస్తున్నారు. బడ్జెట్‌పై చర్చించేందుకు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంది.

Assembly sessions on budget
పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస
author img

By

Published : Mar 11, 2020, 6:06 AM IST

పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే విషయంలో కాంగ్రెస్‌ శాసనసభ్యులు మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపి, తెరాస వైఫల్యాలను తూర్పారబట్టేందుకు యత్నించారు. తీవ్రంగా స్పందించిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ పార్టీని నిలువరించే ప్రయత్నం చేశారు.

మాటల యుద్ధం..

విమర్శలు, సద్విమర్శలు చేసుకోవడం రెండు పార్టీల మధ్య తీవ్రత పెరిగి మాటల యుద్ధానికి దారితీస్తోంది. అసెంబ్లీని పక్కదారి పట్టేంచే విధంగా.. మాట్లాడే సభ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తీసుకురావడం, తన ప్రసంగానికి అడ్డుతగులుతున్నాడన్న కోపంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై సీఎం గట్టిగా స్పందించారు. ఈ సందర్భాలను బట్టి చూస్తే... కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు చేసే విమర్శలను ఎక్కడక్కడ తిప్పి కొట్టేందుకు తెరాస సిద్ధంగా ఉందన్న సంకేతాలను స్వయంగా ముఖ్యమంత్రినే పంపినట్లయింది.

నువ్వా.. నేనా..

శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు చేసి... సభను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తే... కఠినంగా ముందుకు వెళ్లాలన్న దిశలో అధికార పార్టీ ఉంది. అసెంబ్లీ లోపల... బయట జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్... తాము చేసే ఏ విమర్శ కూడా ఆధారాలు లేకుండా ఉండకూడదని భావిస్తోంది.

పద్దులపై లోతైన అధ్యయనం..

ఇదిలా ఉండగా ఇవాళ్టి నుంచి బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించాల్సి ఉండడం.. మంగళవారం సాయంత్రం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 2020- 21 బడ్జెట్‌లో పొందుపరిచిన పద్దులపై లోతైన అధ్యయనం చేశారు. గడిచిన ఆరేళ్లుగా బడ్జెట్​లో శాఖల వారీగా కేటాయింపులు... నిధుల విడుదల, ఖర్చు తదితర అంశాలను పరిశీలించారు.

చర్చకు పట్టుబట్టే అవకాశం..

ప్రధానంగా ఉపప్రణాళికలకు నిధుల కేటాయింపు, రైతు రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్ట్​లకు నిధుల కేటాయింపు వాటితో పాటు సంక్షేమ పథకాలు అమలు, నిధులు కేటాయింపు వంటి అంశాలపై కూడా సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై సభ్యులు మాట్లాడితే... పూర్తి ఆధారాలుండాలని శాసనసభా పక్షం ఇప్పటికే స్పష్టం చేసింది.

తెరాస వైఖరి ఎండగడదాం..

శాసనసభలో ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు వీలుగా అస్త్రశస్త్రాలు కాంగ్రెస్‌ సిద్ధం చేసుకుంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు కార్యారణ రూపకల్పన చేసుకుంది. సభ్యులంతా ఒకే మాటపై ఉండి.... తెరాస వైఖరిని ఎండట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.