సికింద్రాబాద్ వెళ్తున్న కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ సుమారు 3 గంటలపాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం- ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య విద్యుత్ తీగ తెగి పోవటం వల్ల రైలు ఆగిపోయింది. చీకటిలో మార్గమధ్యలో రైల్ నిలిచిపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్నకల్, నెక్కొండ నుంచి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అధికారులు డీజిల్ ఇంజిన్ తెప్పించి నిలిచిపోయిన రైలును మరోలైన్లో కాజీపేట వరకు తీసుకొనిపోయారు. ఈ ఘటనతో ఇరువైపులా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం