మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లిలో కరోనాతో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన ముత్యాల ఆనందం(85), ముత్యాల సరోజనమ్మ(77) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
20 రోజుల క్రితం పెళ్లి బట్టల కొనుగోలు నిమిత్తం భార్య భర్తలు ఖమ్మం వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ ఆనందం శనివారం మృతి చెందాడు. మరుసటి రోజు ఆదివారం మృతుడి భార్య సైతం మృతి చెందినట్లు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనాతో ఒకే ఇంట్లో భార్యాభర్తలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతులిద్దరికి ఖమ్మంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: CS: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్