మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలోని 9వ వార్డులో లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్‌కు భయపడకుండా... ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిని, ఏ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలకు మున్సిపల్ కౌన్సిలర్ హరిసింగ్ దంపతులు ఘనంగా సత్కరించారు.
అనంతరం వార్డులోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, రూరల్ ఎసై రమేశ్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ట్రా'ఫికర్': రోడ్లపైకి లక్షల్లో వాహనాలు