ETV Bharat / state

పంట నష్టపోయామని దంపతుల ఆత్మహత్యాయత్నం - భర్త మృతి, భార్య పరిస్థితి విషమం - రైతుల ఆత్మహత్యలపై NCRB నివేదిక

Farmer Couple Suicide in Mahabubabad : రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన మిర్చి పంట చేతికి వస్తుందన్న సమయానికి తెగుళ్ల బారినపడింది. అయినా పట్టు వదలకుండా మళ్లీ ప్రయత్నించాడు. చివరి ప్రయత్నంలో పంటకు మందు పిచికారీ చేసి, లాభం వస్తుందని ఆశించాడు. కానీ ఎంత ప్రయత్నించినా పంట చేతికి రాదేమోనని ఆందోళనకు గురయ్యాడు. ఇక లాభం లేదనుకుని ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Crop Loss forces Farmer Couple attempt Suicide
Farmer Couple Suicide in Mahabubabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 6:25 PM IST

Farmer Couple Suicide in Mahabubabad : సాగు చేసిన పంట తెగుళ్ల బారిన పడటంతో నష్టపోయామని తీవ్ర ఆవేదనకు గురైన గిరిజన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంప్ తండాలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ వీరు నాయక్(40), లలిత(38) దంపతులకు మూడున్నర ఎకరాల భూమి ఉంది.

Crop Loss forces Farmer Couple attempt Suicide : ఈ భూమిలో ఒక ఎకరంలో మిరప, ఒక ఎకరంలో వరి, ఒకటిన్నర ఎకరంలో పత్తి (Cotton Crop) పంటలను సాగు చేశారు. పెట్టుబడి కోసం రూ.మూడు లక్షల వరకు ఖర్చు చేశారు. మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో అప్పులు తీరి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ పంటకు తెగుళ్లు(Crop pests) వ్యాపించడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

చివరి ప్రయత్నంగా ఈ నెల 8న దంపతులు మిర్చి పంటకు మందు పిచికారీ (Drug sprayer) చేశారు. పంట చేతికి వచ్చేలా కనిపించకపోవడంతో మనోవేదనతో లలిత మిర్చి తోట వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్య చేతిలో పురుగుల మందు డబ్బా లాక్కొని భర్త వీరు నాయక్ కూడా పురుగుల మందు తాగాడు.

''లోక్​సభ ఘటన' వెనుక పెద్ద వ్యక్తులు, వారంతా తప్పించుకున్నారు!- తప్పు చేస్తే ఉరితీయండి!!'

Farmers Suicide for Crop Losses in Telangana : దీనిని గమనించిన చుట్టుపక్కల రైతులు వీరిని వరంగల్​లోని ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ వీరు నాయక్ మృతి చెందగా, లలిత పరిస్థితి విషమంగానే ఉంది. వీరికి ఇద్దరు కుమారులు. వీరు నాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

NCRB Report on Farmers Suicide : ఇదిలా ఉండగా పంట నష్టపోయి ఆత్మహత్య (suicide) చేసుకుంటున్న రైతుల సంఖ్య ప్రతి ఏటా ఎక్కువగానే ఉంటోంది. నేషనల్​ క్రైమ్​ రికార్డ్ బ్యూరో ఎన్​సీఆర్​బీ 2022 నివేదిక ప్రకారం రోజు వారీ వేతన కార్మికులే అత్యధికంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అందులో రైతులు 122 మంది కాగా, రైతు కూలీలు 606 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

2366 Farmers Suicides in Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు ఆ రాష్ట్రంలో 2366 మంది రైతులు ఆత్మహత్య(Farmers Suicide) చేసుకున్నట్లు వెల్లడించింది. అత్యధికంగా అమరావతిలో 951 మంది రైతులు చనిపోయారు. ఛత్రపతి శంభాజినగర్‌ డివిజన్‌లో 877, నాగ్‌పుర్​లో 257, నాసిక్‌లో 254, పుణెలో 27 మరణాలు నమోదయ్యాయి.

'శబరిమలలో పరిస్థితులు ఘోరం- రద్దీ ఉంటుందని తెలిసినా చర్యలెక్కడ?'- పినరయి సర్కార్​పై విపక్షాల సీరియస్!

బేకరీలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ - 15 మందికి గాయాలు - సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.