ETV Bharat / state

విద్యార్థుల వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం

ఇరవై ఒకటో శతాబ్ద నైపుణ్యాలు, ఆకృతి ఆలోచనలను (డిజైన్‌ థింకింగ్‌) విద్యార్థుల్లో పెంపొందించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉండే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌-2020 (ఎస్‌ఐసీ)’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Encourage students to come up with innovative ideas
విద్యార్థుల వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం
author img

By

Published : Sep 25, 2020, 2:26 PM IST

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ), యూనిసెఫ్‌, ఇంక్వి-లాబ్‌ ఫౌండేషన్‌ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్‌ జిల్లా నుంచి 123 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ ప్రక్రియలో తొలుత ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు శుక్రవారం ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ఆలోచనలను వెలికి తీసి వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే దిశగా ఆవిష్కరణలకు ప్రోత్సహించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులకు శిక్షణ

ఈ కార్యక్రమంలో తొలుత నమోదు చేసుకున్న పాఠశాలల్లోని ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. ఆకృతి ఆలోచనల పద్ధతులు, ప్రక్రియపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల బృందాలను గుర్తిస్తారు. టీ-శాట్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు.

దేశంలోనే వినూత్న కార్యక్రమమిది.. : బి.అప్పారావు, జిల్లా సైన్స్‌ అధికారి

ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌-2020 కార్యక్రమం దేశంలోనే వినూత్నమైనది. విద్యార్థులు స్థానిక, పరిసరాల సమస్యలను గుర్తించి వినూత్న ఆవిష్కరణలతో పరిష్కారాన్ని సూచిస్తారు. ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం విశేషం. దీంతో విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత మెరుగుపెడతారు. ప్రతి పాఠశాల నుంచి రెండేసి ఆకృతి ఆలోచనలను పంపించాల్సి ఉంటుంది.

ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు..

ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీవీబీ, ప్రభుత్వ ఆదర్శపాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు వివిధ సమస్యలను గుర్తించి వాటికి వినూత్నంగా పరిష్కారాలను తెలిపేలా ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుంది. విద్యార్థులు వీడియో బోధనలను వీక్షించడం, శిక్షణ నుంచి సమస్యల పరిష్కారానికి వినూత్న కృత్యాలను చేపట్టాల్సి ఉంటుంది. ఉత్తమమైన 25 వినూత్న ఆవిష్కరణలను ఎంపిక చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.