మహబూబాబాద్ జిల్లా మరిపెడలో తొర్రూర్ డీఎస్పీ మదన్‌లాల్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 1 ట్రాక్టర్‌తో పాటు అక్రమంగా విక్రయిస్తున్న రూ.40 వేల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలకు పాల్పడితే బాధ్యులైన వారిపై కేసులతో పాటు కఠిన చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ మదన్‌లాల్ పేర్కొన్నారు. ప్రజలకు శాంతిభద్రతల పై భరోసా కల్పించేందుకే ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 75 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి:- తుపానుపై అణు బాంబు వేస్తే సరి: డొనాల్డ్ ట్రంప్