ETV Bharat / state

పెరిగిన పెట్రో, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన - mahabubabad district Latest news

పెరిగిన పెట్రో, డీజిల్ ధరలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అడ్డు, అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

Congress protest against petrol rates in mahabubabad district

author img

By

Published : Jun 11, 2021, 5:59 PM IST

పెట్రో, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అడ్డు, అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి కొమ్మినేని సతీష్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల, చమురు ధరలను అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : Rare surgery: బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ముద్ద గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.