మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు గ్రామంలో వెంకన్న-భవానీ దంపతులకు మూడు సంవత్సరాల కుమారుడు రిశాంత్ ఉన్నాడు. తల్లి భవానీ ఇంట్లో తన పని చేసుకుంటుండగా రిశాంత్ ఇంటి పక్కన ఉండే స్నేహితులతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన కుమారుడు.. పాల కోసమని ఆ తల్లి వంటింట్లోకి వెళ్లింది. అక్కడే ఉన్న బాబు.. ఎదురుగా కనిపించిన బిందెతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బిందెలో తలపెట్టాడు.
అందులోనే తల ఇరుక్కుపోయి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. పిల్లాడు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తల్లి పరుగున వంటింటి నుంచి బయటకు వచ్చింది. బిందెలో తల ఇరుక్కుపోవడం గమనించి బాలుడి తలను తీయడానికి ప్రయత్నించింది. ఎంత ట్రై చేసినా రాకపోవడంతో భర్తను పిలిచింది. అతడు కూడా కుమారుడి తలను బిందెలో నుంచి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
- ఇదీ చదవండి : లండన్లో కేటీఆర్.. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
ఈ విషయం తెలిసి వెంకన్న ఇంటి వద్ద ఇరుగుపొరుగు గుమిగూడారు. తలా ఒక చేయి వేసి బిందెలో నుంచి ఆ పిల్లాడి తలను తీయడానికి ప్రయత్నించారు. ఎవరి వల్ల కాకపోవడంతో కట్టర్ సాయంతో బిందెను కోసి బాలుడి తలను బయటకు తీశారు. బిందెలో నుంచి తల బయటకు వచ్చిన తర్వాత రిశాంత్ తల్లి ఒడిలోకి చేరి గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. బాలుడి తల బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- ఇదీ చదవండి : రైల్వే పోలీసు చాకచక్యం.. పడబోతున్న ప్రయాణికుడిని..