మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భాజపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పెద్దవంగర మండల భాజపా జడ్పీటీసీ అభ్యర్థిగా రంగు స్నేహా గౌడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని అందుకే పీజీ పూర్తి చేసి రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో జడ్పీటీసీగా పోటీ చేస్తున్నానని తెలిపారు.
ఇవీ చూడండి: పంటల బీమా గడువు ఖరారు చేసిన వ్యవసాయశాఖ