ED Inquiry in Formula E Case : ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి గురువారం (జనవరి 02న) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఇద్దరు అధికారులు విచారణకు హాజరయ్యేందుకు ఈడీని గడువు కోరిన గడువును కోరారు. విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి ఈనెల 8న హాజరవుతానని ఈడీ అధికారులకు తెలిపారు. రేపు జనవరి 03న ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ సైతం హాజరు కావాల్సి ఉండగా, ఈనెల 9న హాజరవుతానని ఆయన ఈడీని కోరారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి విజ్ఞప్తులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ అంశంపై ఈడీ స్పందించాల్సి ఉంది.
నిధులు నేరుగా మళ్లింపు : కాగా హైదరాబాద్‌లో ఈ-రేస్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు నేరుగా రూ. 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటీష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఘటనపై ఈడీ ఆరా తీస్తోంది. ఏసీబీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అవకతవకలు జరిగాయని, భారీగా నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించిన ఏసీబీ ప్రధానంగా ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ-1గా, అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏ-2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ-3గా పేర్కొంది.
తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు : ఏసీబీ కేసు నమోదు చేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కేటీఆర్‌కు ఊరట కల్పించింది. కేటీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2024 డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డిసెంబర్ 31న జరిగిన విచారణలో కేటీఆర్‌ను ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశిస్తూ ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది.
ఫార్ములా ఈ రేస్ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా - ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చు: కీటీఆర్