మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన మహబూబ్ రెడ్డి.. అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు చేపట్టిన పాద యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. గత మూడేళ్లుగా మహబూబ్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ శబరిమలకు వెళ్తున్నాడు.
కాలినడకనే శబరిమల కొండకు చేరి అయ్యప్పస్వామిని దర్శించుకుంటానని, ఇంటి దగ్గర నుంచి స్వామి చెంతకు చేరడానికి సుమారు 80 రోజులు పడుతుందని మహబూబ్ రెడ్డి తెలిపారు. యాత్రలో తనకవసరమయ్యే వస్తువులను, సరుకులను తీసుకెళ్లేందుకు సైకిల్‌ను ఏర్పాటు చేసుకునంటానని పేర్కొన్నారు.
తొర్రూరు నుంచి మహబూబాబాద్, భద్రాచలం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మధురై, ఎర్నాకులం మీదుగా ఏరుమేలి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటానన్నారు. మహబూబాబాద్ చేరుకున్న మహబూబ్ రెడ్డికి అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...