మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు గుగులోతు సోమ్లా
ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న రూప్లాతండాకు చెందిన బానోత్ ధర్మా వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్విస్తుండగా చూసేందుకు అక్కడికి వెళ్లాడు. అనంతరం బావి పక్కనే ఉన్న వేపచెట్టుకు వేప పుల్లలు తెంపేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారటం వల్ల వ్యవసాయ బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న వ్యక్తులు అతడిని బావిలోంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.