ETV Bharat / state

సాలీడు గూడుపై హిమ సొగసు - మంచు ముత్యాల సాలెగూడు

చలికాలంలో మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో.. పచ్చని మొక్కలపై హిమజల్లులతో పాటు నీటి బిందువులతో గూడు కట్టుకుందా..! అనేలా ఉన్న సాలెగూడులు చూపరులను కట్టిపడేసేలా ఉన్నాయి.

A spider web covered with snowdrops in mahabubabad
సాలీడు గూడుపై హిమ సొగసు
author img

By

Published : Jan 18, 2021, 10:38 AM IST

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ప్రకృతి మంచుదుప్పటి కప్పుకుంది. నేరడ శివారు అటవీ ప్రాంతంలో మంచు బిందువులతో నిండి ఉన్న ఓ సాలెగూడు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి భూగోళం పటంలా కనిపిస్తోన్న ఈ మంచు ముత్యాల సాలెగూడు.. ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కింది.

అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ఈ గూడు.. ఓ దారం ఆధారంగా వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దారం కూడా సాలె పురుగు అల్లినదే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:మందమర్రిలో మంచు అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.