తుమ్మిడిహట్టి ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు పయన మయ్యారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మల్లురవితో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించి... క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోనున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు 70 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీటిని తరలించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రచారం చేయడమే కాకుండా... ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు.
ఇదీ చూడండి : ఈనెల 28న అల్పపీడనం... నేడు, రేపు వర్షాలు...