ETV Bharat / state

భీమ్​ ఇలాకాలో దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి... ఎందుకంటే! - SS Rajamouli News

SS Rajamouli Visited Galibudaga Theater: దర్శకధీరుడు ఎస్​ఎస్ రాజమౌళి ఇవాళ కుమురంభీమ్ ఇలాకాలో సందడి చేశారు. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన కుమురంభీమ్ ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటించారు. అక్కడ మహిళ ఆధ్వర్యంలో నిర్మించిన సినిమా థియేటర్​ను సందర్శించారు.

Rajamouli
Rajamouli
author img

By

Published : Apr 12, 2022, 3:57 PM IST

భీమ్​ ఇలాకాలో దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి... ఎందుకంటే!

SS Rajamouli Visited Galibudaga Theater: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి సినిమా థియేటర్​ను కట్టడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని దర్శకుధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఇవాళ ఆయన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న గాలిబుడుగ థియేటర్​ను సతీసమేతంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. రాజమౌళి రాకను పురస్కరించుకొని థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.

కలెక్టర్ రాహుల్ రాజ్... రాజమౌళి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కుమురం భీమ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. కుమురం భీమ్ వారసులను పేరుపేరున పలకరించిన రాజమౌళి... గాలిబుడగ థియేటర్​లో జిల్లా అధికారులు, కుమురం భీమ్ వారసుల సమక్షంలో కొద్దిసేపు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి థియేటర్ కట్టడం ఆనందంగా ఉందన్న రాజమౌళి... జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి అటవీ ప్రాంతంలోని అందమైన ప్రదేశాలను చూడటానికి మరోసారి ఆసిఫాబాద్ వస్తానని రాజమౌళి పేర్కొన్నారు.

కుమురంభీమ్ మీద సినిమా తీయడం.. ఇప్పుడా జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కట్టిన సినిమా థియేటర్​లో పెద్దమొత్తంలో మహిళలదే పాత్ర ఉన్నట్లు తెలిసింది. మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నాకు తెలిసి ఇండియాలో మహిళలంతా కలిసి సంఘటిత శక్తిగా ఏర్పడి ఒక థియేటర్​ కట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఇండియా మొదటిసారి ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా మళ్లీ ఇక్కడకు వస్తాను. జిల్లాలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని తెలిసింది..మళ్లీ వచ్చినప్పుడు మొత్తం కలియ తిరుగుతాను.

-- రాజమౌళి, దర్శకుడు

RRR collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా 'ఆర్​ఆర్​ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వసూళ్ల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సరికొత్త రికార్డు క్రియేట్​ చేసింది 'ఆర్​ఆర్​ఆర్'​. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్​ సాధించి.. టాప్‌ గ్రాసర్‌ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా 'ఆర్​ఆర్​ఆర్'​ కన్నా ముందు ఆమిర్​ ఖాన్​ 'దంగల్'​, ప్రభాస్​ 'బాహుబలి 2' మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన 'దంగల్​' రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్​ అయిన బాహుబలి కంక్లూజన్​ రూ.1,810 కోట్లు అందుకుంది.

ఇదీ చూడండి: అమెరికాలో 'ఆర్​ఆర్​ఆర్'​ సరికొత్త రికార్డు.. వరల్డ్​లో టాప్​-3గా ఘనత!

'ఆర్ఆర్​ఆర్​లో​ ఆ సీన్​ కోసం మూడేళ్లు కష్టపడ్డాం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.