సమత కేసు తుది తీర్పు ఈనెల 30కి వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపై వెళ్లినట్లు ప్రాషిక్యూషన్ ధర్మారెడ్డి వెల్లడించారు. 30న తుది తీర్పు వెల్లడిస్తారని తెలిపారు.
గతేడాది నవంబర్ 24న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో ఓ వివాహిత హత్యాచారానికి గురైంది. షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మగ్దూం అనే ముగ్గురు వ్యక్తులపై ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. 14న నిందితులపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ జరిగింది. ఈనెల 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు సాగాయి.
10న నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. 20న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పును వెలువరించాల్సి ఉండగా... ఈనెల 30కి వాయిదా వేసింది.
- ఇదీ చూడండి : హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు