ETV Bharat / state

హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు - hajipur convict psyco srinivas final judgment today

హాజీపూర్ బాలికల హత్యల కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ముగ్గురు బాలికల హత్యోదంతాల్లో నల్గొండలోని పోక్సో చట్టం న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరఫున వాదనలు విన్న కోర్టు.. ఘటనలు జరిగిన ఎనిమిది నెలల అనంతరం నిందితుడికి శిక్ష విధించే అవకాశముంది.

హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు
హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు
author img

By

Published : Jan 27, 2020, 4:24 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో చోటుచేసుకున్న బాలికల దారుణ హత్యల కేసుల్లో నేడు తీర్పు వెలువడనుంది. ముగ్గురు విద్యార్థినుల్ని పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనల్లో... నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. లైంగిక నేరాల నుంచి చిన్నారుల్ని కాపాడే పోక్సో చట్టం కింద కేసులు నమోదు కావడం వల్ల... నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో చట్టం కోర్టులో విచారణ సాగింది. నూటా ఒక్క మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికల్ని... పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

గత డిసెంబరు 28తో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో... తుది వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.చంద్రశేఖర్... నిందితుడి తరఫున డిఫెన్స్ న్యాయవాది రవీంద్రనాథ్ ఠాగూర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించనున్నారు.

గతేడాది మార్చి 9న ఒక బాలిక... ఏప్రిల్ 25న మరో బాలిక... 2015 ఏప్రిల్‌లో ఇంకో బాలిక... ఇలా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో ముగ్గురు మైనర్లు అదృశ్యమయ్యారు. గతేడాది ఏప్రిల్ 26న హాజీపూర్ శివారులోని పాడుబడ్డ బావిలో... ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. ఆ రోజునే నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు సైతం సమీప బావుల్లో బయటపడ్డాయి. శ్రీనివాస్‌ రెడ్డే హత్యాచారం చేసి బావుల్లో వేసి మట్టి పోసి మరీ దారుణాలకు పాల్పడినట్లు గుర్తించిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు... పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు అమ్మాయిలే కాకుండా గతంలో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన సమయంలో శ్రీనివాస్ రెడ్డి... మహిళను హత్య చేశాడంటూ ప్రాసిక్యూషన్ వాదించింది.

పోలీసులు అందజేసిన సాక్ష్యాల్లో పసలేదని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఇలా ఇరుపక్షాల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తీర్పు వెలువరించనున్నట్లు ఈ నెల 17న ప్రకటించింది.

హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

Srinagar (J and K), Jan 26 (ANI): National airline Air India on Sunday distributed 30,000 handmade Indian flags to its passengers at Srinagar, Delhi, Mumbai, Kolkata, Chennai, Bengaluru and Hyderabad airports to mark the 71st Republic Day. The airline also put up a hoarding at Srinagar's historic Lal Chowk, congratulating the people of Jammu and Kashmir. This is the first Republic Day after the abrogation of Articles 370 and 35A of the Constitution. Air India Spokesperson Dhananjay Kumar told ANI, "Today our country is celebrating Republic Day. To show our love towards our country and its people, we decided to do this gesture. We are distributing the flags at major airports. We also put up a big hoarding at Lal Chowk in Sri Nagar, which is the heart of the Valley. We wished people happy Republic Day through this gesture, which is a first in Air India's history," he said here. People received the gesture warmly and lauded the effort made by Air India.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.