ETV Bharat / state

'దశాబ్దాల కలకు మోక్షం.. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం' - తెలంగాణ వార్తలు

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని రాస్పల్లి వాగుపై వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. వంతెన నిర్మాణం రాస్పల్లి గ్రామస్థుల దశాబ్దాల కల అని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు రూ.5కోట్ల ఐటీడీఏ నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

raspally-bridge-foundation-stoned-by-mla-koneru-konappa-at-kagaznagar-in-komaram-bheem-district
దశాబ్దాల కల నెరవేరుతుంది: ఎమ్మెల్యే
author img

By

Published : Jan 16, 2021, 5:07 PM IST

రాస్పల్లి గ్రామ ప్రజల దశాబ్దాల కల త్వరలో నెరవేరనుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని రాస్పల్లి వాగుపై వంతెన నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. వచ్చే ఏడాదికల్లా రాస్పల్లి గ్రామస్థులు వంతెన పై నుంచి రాకపోకలు సాగించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 1300 మంది జనాభా కలిగిన రాస్పల్లి గ్రామం ఆది నుంచి వంతెన కష్టాలు ఎదుర్కొంటుందని తెలిపారు.

వర్షాకాలం వాగు ఉప్పొంగడం వల్ల స్థానికులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. 2015లోనే వంతెన మంజూరు అయినప్పటికీ ఆదిలోనే ఆగిపోయిందని పేర్కొన్నారు. 2018లో మాజీ మంత్రి జోగు రామన్న వంతెన పనులకు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. సుమారు రూ.5కోట్ల ఐటీడీఏ నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వంతెన నిర్మాణం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: భవిష్యత్​కు ఆశాకిరణం.. కొవిడ్ వ్యాక్సిన్ : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.