ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన రెండు దుకాణాలపై కేసులు - కుమురం భీం జిల్లా తాజా వార్తలు

లాక్​డౌన్​ పాటిస్తున్నట్లు నటిస్తూ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోన్న రెండు దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో 10 గంటల తర్వాత షట్టర్లు మూసివేసి చాటుగా వ్యాపారం కొనసాగిస్తూ పోలీసులకి పట్టుబడ్డారు.

lockdown rules break, kagaznagar
lockdown rules break, kagaznagar
author img

By

Published : May 13, 2021, 1:10 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో లాక్​డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న లాక్​డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార నిర్వహణకు అనుమతి ఇచ్చారు. అయితే కొంతమంది వ్యాపారులు 10 గంటల తర్వాత షట్టర్లు మూసివేసి నిబంధనలకు విరుద్ధంగా చాటుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

కాగజ్​నగర్ పట్టణంలోని స్వప్న షాపింగ్ మాల్, భాగ్యలక్ష్మి క్లాత్ స్టోర్ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున ఎస్.ఐ.వెంకటేశ్​ కేసు నమోదు చేశారు. లాక్​డౌన్ సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.