కరోనా పేషెంట్లకు సరైన సమయంలో భోజన వసతి కల్పించడం లేదంటూ ఓ వ్యక్తి ఐసోలేషన్ కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టాడు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలంలో జరిగిందీ ఘటన. గోలేటి టౌన్ షిప్‌లోని ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతోన్న తన భార్య.. సరైన వసతులు లేక కనీసం సమయానికి భోజనం కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతోందని నరసింహరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
సమస్యల పట్ల అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక సింగరేణి, యూనియన్ అధికారులు.. పేషెంట్ల సమస్యలు తీరేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నాడు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు: సీఎస్