ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు నూతనంగా క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాగజ్ నగర్ పట్టణంలోని ఆర్ఆర్వో కాలనీలో నిర్మించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సతీమణి నూతన క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ విద్యావతి, తెరాస పార్టీ కార్యకర్తలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మీ అత్తను కొట్టా.. బతికి ఉందో లేదో చూడు