లాక్డౌన్ సడలింపుల ఫలితంగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడింది. ఉదయం 11.10 నిమిషాలకు తెలంగాణ ఎక్స్ప్రెస్ కాగజ్నగర్ స్టేషన్కు చేరుకొంది. కాగజ్నగర్ ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్ బౌమిక్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్ ఇతర అధికారులు రైల్వే స్టేషన్ సందర్శించి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. ప్రయాణికుల వివరాలు సేకరించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
ఇవీచూడండి: స్క్రీనింగ్ చేసి స్వగ్రామాలకు ఒడిశా కూలీల తరలింపు