కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోల అలజడి నేపథ్యంలో వారికి ఎవరూ సహకరించరాదని జిల్లా ఇంఛార్జీ ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మావోయిస్టులు గ్రామాల అభివృద్ధికి అడ్డు తగలకుండా ఉండాలన్నారు.
ప్రజలు చైతన్యంతో ఉంటూ వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా పోలీసులకు సమాచారం అందించాలని ఇంఛార్జీ ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మావోయిస్టులు తమ తీరు మార్చుకొని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని అన్నారు. వెంటనే లొంగిపోయిన వారికి అన్ని విధాలా జీవనోపాధికి సహకరిస్తామన్నారు. మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచి బహుమతులు అందజేస్తామన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్