కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పురపాలక సంఘం 11వ ఛైర్మన్‌గా మహమ్మద్ సద్దాం హుస్సేన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పురపాలక కార్యాలయానికి సాదా సీదాగా సైకిల్‌పై వచ్చిన ఛైర్మన్‌కు కమిషనర్ తిరుపతి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో ఛైర్మన్ గదిలోకి ప్రవేశించారు.
ఛైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ ఛైర్మన్ గిరీశ్ కుమార్‌కు ఎమ్మెల్యే కోనప్ప శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యేను సన్మానించారు.
ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ