కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలిక తెరాస అభ్యర్థులకు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు బీ-ఫామ్‌లు అందజేశారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసినప్పటికీ... అందరినీ సమన్వయపరిచి ఉపసంహరించుకునేలా ఒప్పించారు.
నామినేషన్ వేసిన వారితో కోనేరు కోనప్ప నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. పోటీ నుంచి విరమించుకొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం