ETV Bharat / state

ఆ ఆలయంలో జాతర.. ఇంకా పూర్తికాని ఏర్పాట్లు - Latest news in Telangana

కుమురం భీం జిల్లా గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు కొద్ది రోజులే సమయం ఉండగా.... అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నా.... శాశ్వత పరిష్కారం చూపించటంలేదని ఆరోపించారు.

ఆ ఆలయంలో జాతర.. ఇంకా పూర్తికాని ఏర్పాట్లు

author img

By

Published : Feb 23, 2021, 3:21 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ వాగు ఒడ్డుపై వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో... ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జాతర, రథోత్సవం నిర్వహిస్తారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. కానీ, భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

పూర్తి కాని ఏర్పాట్లు

జాతరకు సుదూర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న భక్తులకు ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి. స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా సుమారు 30 లక్షల ఆదాయం వస్తున్నా..... అభివృద్ధి మాత్రం జరగట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

బందోబస్తు

జాతర నిర్వహణకు పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించారు. వేలాది మంది భక్తులు వస్తుండటంతో.... వివిధ శాఖల సమన్వయంతో జాతర నిర్వహిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐదేళ్ల క్రితం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆలయాన్ని సందర్శించి.... అభివృద్ధి కోసం 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చినా... ఇప్పటికీ నెరవేరలేదు.

ఇదీ చూడండి: బాయిలర్​లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.