ETV Bharat / state

అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున దేవదేవుడు సాక్షాత్కరిస్తాడు!

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో బాలాజీతో పాటు గోవింద రాజస్వామి, శివుడు, హనుమంతుడు దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకం. ఆలయాన్ని నిర్మించిన పోతాజీ మరణానంతరం ఆయన సమాధిని ఆలయ ముందు భాగంలో నిర్మించారు.

Goddess will witness there on the full moon day at gangapur
అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున దేవదేవుడు సాక్షాత్కరిస్తాడు!
author img

By

Published : Feb 10, 2020, 4:20 PM IST

అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున దేవదేవుడు సాక్షాత్కరిస్తాడు!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్​ శివారు.. వాగు ఒడ్డున శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువు దీరింది. ఈ ఆలయ నిర్మాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రెబ్బెన మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో వెలిసింది. 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్ గ్రామానికి చెందిన బ్రాహ్మణడు ముమ్మడి పోతాజీ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూజారులు చెబుతున్నారు.

కాలినడకన వెళ్లి మొక్కులు

'పోతాజీ చిన్నతనంలోనే ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు కాలినడకన తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు. ఆ తర్వాత వయసు పైబడటం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం స్వామి చెంతకు వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతని బాధను ఆలకించిన స్వామి ఓ రోజు రాత్రి కలలో దర్శనమిచ్చారు. గ్రామ పొలిమేరలోని గుట్ట ముందు భాగంలో ఆలయం నిర్మించాలని సూచించారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు అక్కడే భక్తులకు దర్శనమిస్తానని స్వామి కలలో చెప్పారు.' అని అక్కడి భక్తులు చెబుతున్నారు.

గుహను తొలవగా యాదృచ్ఛికంగా

వాగును ఆనుకుని ఉన్న గుట్ట మధ్య భాగంలో ఒక గుహను తొలవగా యాదృచ్ఛికంగా అక్కడ రహస్యంగా ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి పట్టే, నామాలు దర్శనమిచ్చాయి. పర్వతం మొదటి భాగంలో గోవిందరాజుల విగ్రహాలు, స్వామి వారి శివాలయం పక్కనే వాయుపుత్ర హనుమాన్, గరుడ విగ్రహాలు లభించాయి. ఆలయం లోపల గృహంలో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన 12 విగ్రహాలు సైతం గోడలకు ఏర్పాటు చేసి ఉన్నాయనేది స్థానికంలో ప్రచారంలో ఉంది.

తర్వాత కాలంలో ఆలయం ముందు భాగాన పోతాజీ సమాధి ఏర్పాటు చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీరుతాయని భక్తుల అపారమైన నమ్మకం. జాతరలో మొదటి రోజున స్వామి వారి కల్యానోత్సవం, రెండో రోజున రథోత్సవం, మూడో రోజున నాగవెల్లి నిర్వహిస్తారు.

ఇదీ చూడండి : సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.