కుమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో గ్యాస్ లీకైంది. గ్యాస్ లీకైన ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం జరిగిన ఘటనను యాజమాన్యం రహస్యంగా ఉంచింది.
కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించడం వల్ల ఈ ఘటన బయటపడింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: కరోనాను జయించిన వారి సాయంతో వైరస్‌కు కళ్లెం!