కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్లో.. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. నేటి నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతరకు.. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆలయ ప్రాంగణంలో నేడు.. స్వామి, అమ్మవార్ల కళ్యాణమహోత్సవం జరగనుంది. 27న జరగనున్న రథోత్సవం.. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు.
ఇదీ చదవండి: యాదాద్రి పాతగుట్టలో కన్నులపండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు