కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పట్టణంలోని 30 వార్డులకు గాను మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 186 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. మంగళవారం రోజున పలువురు అభ్యర్థులు వివిధ కారణాలతో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారులు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పురపోరులో మొత్తం 124 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 27 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్ సవాల్ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!