కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అడవుల రక్షణకు శ్రమిస్తోన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
ఇలాంటి హేయమైన చర్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : అటవీ అధికారులపై దాడి.. 11మందిపై కేసు నమోదు