ETV Bharat / state

తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్​

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సందర్శించారు. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.

తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్​
తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్​
author img

By

Published : Nov 11, 2020, 2:43 PM IST

కుమురం భీం జిల్లా నూతన పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రాజ్ మొదటి సారిగా కాగజ్​నగర్ పట్టణానికి వచ్చారు. పట్టణంలోని పలు వార్డులు సందర్శించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.​

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అయిందని... చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దరఖాస్తు దారులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కాగజ్​నగర్ ఆర్డీవో ఆర్​ఎస్​ చిత్రు, సిబ్బంది ఉన్నారు.

ఇదీ చూడండి: ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.