ETV Bharat / state

కుమురం భీం జిల్లాలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా కేసులు - జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝ

కరోనా కేసుల పెరుగుదలతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేగుతోంది. తాజాగా జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పాలనాధికారి సందీప్ కుమార్ ఝ వెల్లడించారు.

కుమురం భీం జిల్లాలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా కేసులు

author img

By

Published : Aug 10, 2020, 10:19 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరగడం వల్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝ తెలిపారు.

మొత్తంగా 185 కేసులు నమోదు...

ఆసిఫాబాద్​లో 5, గోలేటిలో 8, రెబ్బెనలో 2 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం మీద జిల్లాలో 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఝ పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు. ముఖానికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్​ వినియోగించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి : భార్యకు కరోనా సోకిందని భర్త పరార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.