కాగజ్ నగర్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ మద్యం రవాణాలో బడా బాబులను వదిలేసి చిన్న వ్యాపారులను బలిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. చాపకింద నీరులా సాగుతున్న దందాపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అక్రమ మద్యం వ్యాపారంలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడితోపాటు, మరో ముగ్గురు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నారని వెల్లడించారు. వారిని వదిలేసి గొలుసు దుకాణాలు నడుపుకునే చిన్న వ్యాపారులపై కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు.