కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా పర్యటిస్తూ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో డీజీపీ బస చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ... సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా డీజీపీని కలవడానికి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
ఈ మేరకు జిల్లాలో అసలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సమీక్ష సమావేశం అనంతరం బయటికి వచ్చిన అడిషనల్ ఎస్పీ సుధీంద్ర, మంచిర్యాల జిల్లా డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిని మీడియాను కలవడానికి ప్రయత్నించగా వారు నిరాకరించారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'