కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఫీవర్ సర్వే, కరోనా నివారణ చర్యలను కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించారు. రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకొని సర్వే జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. సర్వే బృందం సభ్యులు సేకరించిన వివరాలను ఆయన పరిశీలించారు.
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఇచ్చే మందులు, కిట్స్‌ను పరిశీలించిన ఆయన.. కొవిడ్ బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని ఆదేశించారు. వారికి తగు సూచనలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజేశం, కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి