ETV Bharat / state

'సమస్యను పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదు' - కుమురంభీం జిల్లా

గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని భాజపా నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

bjp leaders protest against government on podu lands
'సమస్యను పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదు'
author img

By

Published : Apr 9, 2021, 1:17 PM IST

పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో భాజపా నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని భాజపా నాయకులు పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు.

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతుల పట్ల అటవీశాఖ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు బనాయించి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి గిరిజనులను తెరాస మోసం చేస్తుందని తెలిపారు. దీక్ష స్థలాన్ని ఏఎస్పీ సుధీంద్ర సందర్శించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని... దీక్షను విరమించాలని కోరగా... సమస్య పరిష్కారమయ్యే వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.