త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగ వేడుకలను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఖదీర్ ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు మత గురువుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు హాజరైనందుకు పోలీసులు మైదానంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః నాగార్జునసాగర్ 24 క్రస్ట్ గేట్లు తెరిచిన అధికారులు