వేతనాల కోసం ఆశా కార్యకర్తల ధర్నా అశా కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించాలంటూ నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గత మూడు నెలలుగా జీతాలు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు సర్కార్ దృష్టికి తీసుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావుకు వినతి పత్రం అందజేసారు.
ఇటు కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. గత ఐదు నెలల బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విధులకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదని వాపోయారు.
రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆశాలు హెచ్చరించారు.