ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేట గ్రామంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు సహాయం అందించాలని యువజన సంఘం సభ్యులు సంకల్పించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యూత్ సభ్యులు విరాళాలు సేకరించి బియ్యం, సరకులు పేదలకు పంపిణీ చేశారు. యువకుల స్ఫూర్తిని పలువురు గ్రామస్థులు కొనియాడారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: హింసకు మేం పూర్తిగా వ్యతిరేకం: తబ్లీగీ జమాత్ చీఫ్