ETV Bharat / state

కత్తెర పురుగు చేసే విధ్వంసమేంటి? సస్యరక్షణ చర్యలేంటి? - Corn

కత్తెర పురుగు.. దీనికే పెద్దపెద్ద కోరలుండవు. భారీ ఆకారం అసలే ఉండదు. కాళ్లకేమీ చక్రాలుండవు. కానీ ఆ విధ్వంసం.. ఆ వేగం గ్రహించేలోపే పచ్చని పంటను 'ముక్కలుముక్కలు' చేసేస్తుంది. ప్రతి మొక్కను లెక్కగట్టి మరీ విరిచేస్తోంది! రైతులపై పగ పట్టిందా అన్నట్లు 'కత్తెర పురుగు' సృష్టిస్తున్న అలజడి అధికారులను పరుగులు పెట్టిస్తుంది. కత్తెర పురుగు విధ్వంసం నుంచి పంటనెలా కాపాడుకోవాలి? ఆ సస్యరక్షణ చర్యలేంటి??

What about scissors? What are the conservation measures?
కత్తెర పురుగు చేసే విధ్వంసమేంటి? సస్యరక్షణ చర్యలేంటి?
author img

By

Published : Jun 16, 2020, 4:46 PM IST

కంటికి రెప్పలా సాకుతున్న పంటను కత్తెర పురుగు కమ్మేస్తుంది. ఏం జరుగుతుందో గ్రహించేలోపే పంటను సర్వ నాశనం చేస్తుంది. ఒక్క రోజులోనే పొలమంతా దెబ్బతీస్తుంది. ఆ పురుగు సోకితే మొక్కజొన్న చేతికందటం గగనమే! మొక్కజొన్న కాండం, ఆకులను తినేస్తుంది. ఆకులపై రంధ్రాలను చేసేయటంతో పంట నాశనమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రంధ్రాలు కూడా ఆకులపై నిలువగా కనిపిస్తాయి.

మొదటి దశలో లార్వా ఆకులపై పత్ర హరితాన్ని గోకి తినేయటం వల్ల ఈ రంధ్రాలు ఏర్పడుతున్నాయి. లార్వా పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచీ కత్తిరించినట్లుగా తినేస్తుంది. ఆకు సుడులను, కాండాలను కూడా తొలిచి రంథ్రాలు చేస్తుంది. మూడు నెలలు కకావికలం కత్తెర పురుగు (ఫాల్‌ ఆర్మీ వార్మ్‌) సోకితే వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్లాలి. లేదంటే గరిష్ఠంగా మూణ్నెళ్లు వరకు ఇది పంటను నాశనం చేస్తూనే ఉంటుంది.

వాతావరణ పరిస్థితుల ప్రకారం ఒకటి నుంచి మూణ్ణెళ్ల వరకూ దీని ప్రభావం ఉంటుందని వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు. రెక్కల పురుగులు గుడ్లును మొక్కల సముదాయాల్లో పెడతాయి. తల్లి పురుగు తన జీవిత కాలంలో 900-1,500 గుడ్లును పెడుతుంది.

కత్తెర పురుగులో కీలకమైన దశలు ఇలా

  • గుడ్డుదశ: 2-7 రోజులు
  • లద్దె పురుగు దశ: 14-30 రోజులు
  • కోశస్థదశ: 8-30 రోజులు
  • రెక్కల పురుగుదశ: 7-21 రోజులు

కత్తెర పురుగు విధ్వంసమిలా...

* ఈ పురుగుకు చెందిన మొదటి దశ లార్వాలు ఆకులను గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. తర్వాత దశలో లార్వాలు ఆకుల సుడిలో రంధ్రాలు చేసుకుంటూ తినడం వల్ల విచ్చుకున్న ఆకులపై ఒక వరుసలో రంధ్రాలు ఏర్పడతాయి.

* ఇది సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరిస్తుంది. దీంతో సుడుల్లో పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలు ఉంటాయి. ఎదిగిన లార్వాలు ఆకులను తిని ఈనెలను మిగులుస్తాయి.

* కంకి పొరలను తొలుచుకుంటూ లోపలికి వెళ్లి గింజలను తిని నష్టపరుస్తాయి.

నివారణకు చర్యలు

  1. ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను చేలో అక్కడక్కడ పెట్టాలి.
  2. ఆకులపై కనిపించే గుడ్లలను ఏరి నాశనం చేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను తొలగించాలి.
  3. ఆకులు, సుడులు, కండెలపై ఉండే లద్దె పురుగులను ఏరి కాల్చేయాలి.
  4. పది లీటర్ల నీటికి నోవాల్యురాన్‌ 10 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 3 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 4 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 4 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
  5. పురుగు ఉద్ధృతిని అరికట్టడానికి ఎకరానికి క్లోరాంత్రనిలిప్రోల్‌ 4జి గుళికలు నాలుగు కిలోలు చొప్పున ఆకు సుడుల్లో వేయాలి.
  6. 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంను 2 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు పులియబెట్టాలి. అందులో 100 గ్రాముల థయోడికార్బ్‌ కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట ఆకుల సుడులు, మొవ్వులో వేసుకోవాలి. 25-40 రోజులకు మందుల పిచికారీ చేయాలి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.