రోజురోజుకూ ఖమ్మంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావటం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురువుతున్నారు. ఆదివారం ఒక్కరోజే లక్షణాలు ఉన్న మొత్తం 35 మందికి పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నగర ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. సోమవారం జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి.
అత్యధికంగా నగరంలోనే కేసులు నమోదు కావటం వల్ల స్థానిక కార్పొరేటర్లు వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని జన సమూహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు. ప్రజల్లో నివారణ చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు