ETV Bharat / state

TRS Protest Over Paddy Procurement : 'తెలంగాణ రైతు గోస దిల్లీకి వినిపిస్తాం'

TRS Protest Over Paddy Procurement : రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తెరాస రైతు నిరసనలో పాల్గొన్న మంత్రి.. గులాబీ శ్రేణులతో కలిసి రోడ్డు బైఠాయించారు. కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు మోగించారు.

మంత్రి పువ్వాడ, minister puvvada
మంత్రి పువ్వాడ
author img

By

Published : Dec 20, 2021, 12:00 PM IST

ఖమ్మంలో తెరాస రైతు నిరసన కార్యక్రమం

TRS Protest Over Paddy Procurement : తెలంగాణ రైతు గోస దిల్లీకి వినిపించేలా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తెరాస ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో తెరాస రైతు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు మోగించారు. తెరాస శ్రేణులకు ఆయనతో కలిసి మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంత్రి పువ్వాడ, minister puvvada
మంత్రి పువ్వాడ

Paddy Procurement Telangana : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అన్నారు. రైతులు తలెత్తుకునేలా కేసీఆర్ పథకాలు తీసుకొస్తుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం గుదిబండ మోపుతోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాలని సూచించారు.

మంత్రి పువ్వాడ, minister puvvada
ఖమ్మంలో తెరాస చావు డప్పు

TRS Dharna Over Paddy Procurement :"కేంద్ర నిరంకుశ విధానానికి చావు డప్పు కొట్టాం. రైతుల ఆసక్తి, ఇష్టాలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ పనిచేస్తోంది. రైతులను ఈ ప్రభుత్వం చాలా కష్టపెట్టింది. వారి పోరాటానికి భయపడి దిగివచ్చి నల్లచట్టాలను రద్దు చేసుకుంది. ఏడాది పాటు కర్షకులు పోరాడారు. రైతులతో పెట్టుకున్న ఏ సర్కార్​ కూడా బాగుపడలేదు. అందుకే సీఎం కేసీఆర్ అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వారికి అండగా నిలుస్తున్నారు. పంట పండించడానికి కర్షకులకు ఆర్థిక సాయం చేసిన ఏకైక సర్కార్ తెలంగాణదే. ఏకైక సీఎం కేసీఆరే."

- పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

మంత్రి పువ్వాడ, minister puvvada
కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు

TRS Chavu Dappu : కేంద్ర ప్రభుత్వం వ్యాపారవేత్తలకు వత్తాసు పలికే సర్కార్​ అని మంత్రి పువ్వాడ విమర్శించారు. రాష్ట్ర భాజపా నేతల మాటలన్నీ అబద్ధాలేనని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పార్లమెంటులో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ఒక్కసారి కూడా కాంగ్రెస్ ఎంపీలు అడగలేదని మంత్రి పువ్వాడ అన్నారు. హస్తం హయాంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బాధ్యత విస్మరించిందని మండిపడ్డారు. రైతులంతా యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.